భారత్ న్యూస్ హైదరాబాద్..ఇంత నిర్లక్ష్యమా
ఫుడ్ పాయిజన్ అయిన మరుసటి రోజే పురుగుల అన్నం
మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్ అయి 100 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే.
ఇంత జరిగాక కూడా ఆ మరుసటి రోజే మళ్ళీ మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయి.
కలెక్టర్ వచ్చి నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి వెళ్ళినా, అదే పురుగుల అన్నం పెట్టిన సిబ్బంది.
దీంతో తొలుత ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు ఎంఈవో, హెచ్ఎం మురళీధర్ రెడ్డి , ఇన్చార్జ్ హెచ్ఎం బాబురెడ్డిని సస్పెండ్ చేసిన కలెక్టర్.. ఆ తర్వాత ఘటన జరగడంతో డీఈవోను సస్పెండ్ చేశారు…..
