..భారత్ న్యూస్ హైదరాబాద్….మెకానిక్ రాఖి 2.0 ట్రైలర్ లాంఛ్ చేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య.
హన్మకొండ JNS ఇండోర్ స్టేడియంలో హీరో విశ్వక్ సెన్ నటించిన మెకానిక్ రాఖి 2.0 ట్రైలర్ ను పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ…. హైదరాబాద్ తర్వాత చారిత్రక నగరమైన వరంగల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. రానున్న రోజుల్లో వరంగల్ నగరం మూవీ హబ్ గా మారబోతుందని తెలిపారు. సినిమా షూటింగ్ లకు అనువైన ప్రదేశంగా ఉండబోతుందని పేర్కొన్నారు. హీరో విశ్వక్‌సేన్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం 10లక్షలు విరాళంగా ప్రకటించి తన మంచి మనసు చాటుకున్నారని కొనియాడారు. మెకానిక్ రాఖి 2.0 మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మెకానిక్ రాకీ హీరో విశ్వక్ సెన్, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్, దర్శకుడు రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి మరియు చిత్ర యూనిట్ ను ఎంపీ అభినందించారు.
