భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లకు రూ. 1.50 లక్షల సబ్సిడీ

T.G : రాష్ట్రంలో హరిత రవాణాను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ‘తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్‌ కన్వర్షన్‌ స్కీమ్‌–2026’ను తీసుకొచ్చింది.

ఈ పథకం ద్వారా 18,766 పెట్రోల్‌, డీజిల్‌ ఆటోలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అర్హులైన ఆటో డ్రైవర్లకు రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు.

పాత ఆటోను ఈవీ కిట్‌తో మార్చుకోవడం లేదా స్క్రాప్‌ చేసి కొత్త ఈవీ ఆటో కొనడం అనే రెండు ఆప్షన్లు ఉంటాయి.

ఈ ప్రక్రియను 16 వారాల ప్రణాళికతో ఆన్‌లైన్‌లో పారదర్శకంగా అమలు చేయనున్నారు.