భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్.. నిమిషానికి 1.5 లక్షల టికెట్ల బుకింగ్!
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ త్వరలో అందుబాటులోకి రానుంది.
టికెట్ బుకింగ్‌ను వేగవంతం చేయడానికి క్యాప్చా ధృవీకరణను తొలగించారు.
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పూర్తిస్థాయి వెబ్‌సైట్ ప్రారంభం కానుంది.
కొత్త వ్యవస్థలో నిమిషానికి 1.5 లక్షలకు పైగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు, ఇది ప్రస్తుత 32 వేల సామర్థ్యం కంటే చాలా ఎక్కువ.
విచారణల సామర్థ్యం కూడా 4 లక్షల నుంచి 40 లక్షలకు పెరగనుంది.
వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఏఐ సాంకేతికతను ప్రవేశపెట్టనున్నారు.

ఆగస్టు నుంచి దశలవారీగా ఈ వెబ్‌సైట్ ప్రారంభం కానుంది.
