భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఎల్బీనగర్..
తహసీల్దార్ అక్రమ ఆస్తులపై ఏసీబీ సోదాలు!
రూ.7 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు.. బహిరంగ మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైనే!
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో తహసీల్దార్ దాసరి శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు.
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు.
- నివాసం, కార్యాలయంతో పాటు ఏకకాలంలో 7 ప్రాంతాల్లో మెరుపు సోదాలు.
- ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో గతంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా శ్రీనివాస్‌రెడ్డి పనిచేశారు.
- డీజీ అనుమతితో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు.
సోదాల్లో భారీగా ఆస్తుల గుర్తింపు
- ఇప్పటివరకు 8 ఓపెన్ ప్లాట్లు గుర్తింపు.
- తుర్కయంజాల్‌లో – 3 ప్లాట్లు.
- యాదగిరిగుట్టలో – 3 ప్లాట్లు.
- హస్తినాపురంలో – 1 ప్లాట్.
- విశ్వేశ్వర నగర్ కాలనీలో – 1 ప్లాట్.
- రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి.
- హస్తినాపురంలో మూడంతస్తుల ఇల్లు.
- హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మరో రెండు ఫ్లాట్లు.
- బంగారం.. పెట్టుబడులపై ఏసీబీ ఫోకస్
- ఇంట్లో, బ్యాంకు లాకర్లలో కలిపి కిలోన్నరకు పైగా బంగారు ఆభరణాలు గుర్తింపు.
- శ్రీనివాస్‌రెడ్డి కుమారుడి పేరుతో గ్లాస్‌మేట్ బార్లో రూ.86 లక్షల పెట్టుబడి ఉన్నట్లు గుర్తింపు.
- సుమారు రూ.11 లక్షల విలువైన గృహోపకరణాలు గుర్తింపు.
రూ.7 కోట్లు అధికారిక లెక్క.. మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైనే!
- ఏసీబీ లెక్కల ప్రకారం ఇప్పటివరకు రూ.7 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు.
- బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం.
- మరిన్ని ఆస్తులు, నగదు, విలువైన వస్తువుల కోసం ఏసీబీ సోదాలు, దర్యాప్తు కొనసాగింపు.
లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి
బైట్: ఆనంద్‌కుమార్, ఏసీబీ డీఎస్పీ, రంగారెడ్డి జిల్లా రేంజ్.
ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
