భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల భారీ డంపులు స్వాధీనం ….

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, నారాయణపూర్ జిల్లాల అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు చెందిన రెండు భారీ డంపులను స్వాధీనం చేసుకున్నాయి.

నారాయణపూర్ జిల్లాలో ఆదివారం ఎస్పీ సందీప్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో 303 రైఫిల్, 315 రైఫిల్స్, 12 బోర్ తుపాకులు, బీజీఎల్ లాంచర్లు, టెలిస్కోప్, పేలుడు పదార్థాలు లభించాయి.

సుక్మా జిల్లాలో ఎస్పీ మయాంగ్ గుర్జర్ నేతృత్వంలో జరిగిన తనిఖీల్లో కొడెక్స్ వైర్, డిటోనేటర్లు, జిలిటిన్ స్టిక్స్, టిఫిన్ బాక్స్ బాంబులు, బ్యాటరీలు వంటివి స్వాధీనం చేసుకున్నారు…