ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్

ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

తిరుమల( భారత్ న్యూస్ ) టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గా ప్రమాణం చేశాక తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి ధన్యవాదాలు తెలియజేసి స్వామి వారి ప్రసాదాలు, పుష్పగుచ్చం అందించారు. భక్తులకు స్వామి వారి దర్శనం, అన్నప్రసాదాలు, వసతి సౌకర్యాలపై రాజీ లేకుండా సేవలు అందించాలని ముఖ్య మంత్రి టీటీడీ చైర్మన్ కు సూచించారు.

అలాగే ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కె.పవన్ కళ్యాణ్ , దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని కలిసి స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.