సైబర్ నేరాల పై అవగాహన సదస్సు
పాకాల (భారత్ న్యూస్ ) ప్రభుత్వ జూనియర్ కళాశాల పాకాల నందు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు డిజిటల్ టీవీ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ క్రైమ్ మహిళల పట్ల,చిన్న పిల్లవాళ్ళ పట్ల జరుగుతున్న నేరాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి అధ్యక్షత వహించగా,పాకాల సీఐ మద్దయ్య చారి, ఏ ఎస్ ఐ వెంకటరమణ నాయుడు మరియు వారి పోలీస్ శాఖ సిబ్బంది అలాగే కళాశాల ఆధ్యాపక, ఆధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
