భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు: వన్-వే ప్రారంభం…..

హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ చుట్టూ రూ.1,090 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక హెచ్-సిటీ ప్రాజెక్ట్ పనుల కోసం ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

రాబోయే 24 నెలల పాటు ఈ నిర్మాణ పనులు కొనసాగనున్న నేపథ్యంలో, వాహనదారుల సౌలభ్యం కోసం పోలీసులు వన్-వే విధానాన్ని ప్రారంభించారు. పంజాగుట్ట, మాదాపూర్, ఇందిరానగర్, వెంకటగిరి, ఫిల్మ్‌నగర్ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. పార్కు చుట్టూ 13 లేన్ చేంజర్లు, 10 ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు…