భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
మహా తుఫానుగా మారుతోందా?
ఈ ప్రాంతాలు అలర్ట్
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
బంగాళాఖాతంలో వెదర్ సీన్ సడన్ గా మారిపోయింది. వాయువ్య బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా.. పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలంగా మారి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తుఫాను వచ్చే అవకాశాలు కూడా ప్రస్తావించింది. ఈ ప్రభావంతో తూర్పు, మధ్య భారతంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం పూర్తిగా కూల్ అయింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం ఉత్తర కోస్తాంధ్రపై స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న నాలుగైదు రోజుల పాటు ఉత్తరాంధ్ర తీరం వెంట గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సముద్ర తీరం అల్లకల్లోలంగా మారి పెద్ద ఎత్తున అలలు ఏవిసిపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని కచ్చితంగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన జాతరలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు, తీరానికి తిరిగి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోనూ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వాయువ్య బంగాళాఖాతం నుంచి విస్తరించిన రుతుపవన ద్రోని కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులిటెన్ విడుదల చేసింది.
ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలైన మహబూబాబాద్, వరంగల్, భద్రాది కొత్తగూడెం, హనుమకొండ పరిసర ప్రాంతాల్లో వర్ష ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండనుంది. ఖరీఫ్ సాగులో ఉన్న రైతులకు ఈ చినుకుల ఎంతో ఊరటానివ్వనున్నాయి. ఉరుములు,మెరుపులు, బలమైన ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
చెట్ల కింద,పాతబడిన భవనాలు, కరెంటు స్తంభాలు,హోర్డింగుల కింద నిలబడకూడదు.
పడుతున్న సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను దూరంగా ఉంచటం మంచిది.
ప్రస్తుతం అత్యంత భారీ వర్షాలు హెచ్చరికలు లేకపోయినా, ఈదురు గాలులు వల్ల చిన్నపాటి ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
