భారత్ న్యూస్ అమరావతి..సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

నారావారిపల్లిలో సీఎం చంద్రబాబును కలవడానికి తిరుపతికి చెందిన యశోద అనే మహిళ వెళ్లగా, ఆమెకు అనుమతి లభించలేదు.

దీంతో ఆమె బలవంతంగా లోపలకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన చేతి గాజులు పగులగొట్టుకుని, వాటిని మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

అడ్డుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, చంద్రగిరి పోలీసు స్టేషన్‌కు తరలించి అనంతరం విడిచిపెట్టారు…