భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..నర్సాపురం మొగల్తూరులో “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు.. సీఎంగా 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలు, మహిళలు కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలికారు

Ammiraju Udaya Shankar.sharma News Editor…పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళవారం పర్యటించారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా మత్య్సకారుల కుటుంబాలకు పింఛను పంపిణీ చేశారు. వేటకు వెళ్లే ఫెర్రీ పాయింట్‌కు ముఖ్యమంత్రి మొదట చేరుకున్నారు. పడవల వద్ద కూర్చున్న పలుగురు మత్స్యకారులతో ముచ్చటించారు. తిరుమని స్వామి అనే మత్య్సకారునికి స్వయంగా సీఎం పింఛను సొమ్మును అందజేశారు. వారి కుటుంబాల యోగక్షేమాలు, సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే పథకాల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. వేట సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు….