..భారత్ న్యూస్ అమరావతి.Ammiraju Udaya Shankar.sharma News Editor….రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఎన్టీపీసీకి చెందిన ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్ సుమారు 2 లక్షల కోట్ల రూపాయ‌ల‌ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

ఈ మేరకు గురువారం సచివాలయంలో ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్రానికి చెందిన నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ..ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ, ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ మధ్య ఒప్పందం కుదిరింది.