భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…డీలిమిటేషన్‌ వద్దు.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం*

Ammiraju Udaya Shankar.sharma News Editor…కేంద్రం తీసుకురావాలని చూస్తున్న డీలిమిటేషన్‌ బిల్లుపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో డీలిమిటేషన్‌ బిల్లుకు వ్యతిరేకంగా సీఎం విజయ్‌ ప్రభుత్వం తీర్మానం చేసింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లును వెంటనే తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

లోక్‌సభ సీట్లను 543కు మించి ఒక్క సీటు కూడా పెంచొద్దని.. అక్కడికే శాశ్వతంగా పరిమితం చేయాలని ఉన్న తీర్మానాన్ని సభ ఆమోదించింది. సీఎం విజయ్‌ మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌ బిల్లు వల్ల తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ర్టాలు ప్రాతినిధ్యం కోల్పోతాయని చెప్పారు. 1971 జనాభా లెక్కల ప్రకారం ఏర్పడ్డ 543 లోక్‌సభ స్థానాలను అక్కడికే శాశ్వతంగా పరిమితం చేయాలని డిమాండ్‌ చేశారు.