భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..అమరావతి:ఆగస్టు 21
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్‌ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లు, కార్యాల యాల్లో ఈడీ ఎన్‌ఫో ర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తోంది. ఇవాళ తెల్లవారు జాము నుంచి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు చోట్ల ఈడీ అధికారులు ఈ సోదాలు జరుపు తోంది. హైదరాబాద్ కోకాపేట, పులివెందు లలోని అవినాష్ రెడ్డి నివాసాలతో పాటుగా ఆయన కార్యాలయా ల్లో సోదాలు చేస్తున్నారు.

ప్రధానంగా మనీలాండరింగ్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అంటూ ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలస్తోంది. ఈడీ అధికారులు కీలక డాక్యుమెంట్ల కోసం వెతుకుతున్నట్లు సమాచారం. అంతేకాదు అవినాశ్ రెడ్డి ఆస్తుల వివరాల ను సేకరిస్తున్నారనే ప్రచారం జరరుగు తోంది.

ఎంపీ అవినాశ్ రెడ్డి మాత్రమే కాదు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితు ల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. పులివెం దులలోని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

తొండూరు మండలం టి తుమ్మలపల్లిలో ఎర్ర గంగిరెడ్డి నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇటు పులివెందుల లోని వైఎస్ జగన్ సమీప బంధు సునీల్ రెడ్డి ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈడీ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేపట్ట గా.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.