భారత్ న్యూస్ విజయవాడ…జనవరి 13 నుంచి మహా కుంభమేళా.. ఏర్పాట్లు షురూ
12 ఏళ్లకోసారి నిర్వహించే మహా కుంభమేళాకు యూపీలోని ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 13(పుష్య పూర్ణిమ) నుంచి ఫిబ్రవరి26 (శివరాత్రి) వరకు వైభవంగా కొనసాగనుంది. హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలలోనూ కుంభమేళాను జరపనున్నారు. దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది ప్రజలు, వేలాది మంది సాధువులు, అఘోరాలు రానుండటంతో అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు.
