భారత్ న్యూస్ విజయవాడ….గుంటూరు…

సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ పనిచేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయం పై మీడియా సమావేశం.

గుంటూరు సిద్ధార్థనగర్ లోని అంబటి రాంబాబు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు..

..‌అంబటి రాంబాబు కామెంట్స్….

ఎవరిని బెదిరిస్తావు పవన్ కళ్యాణ్, సుమొటోగా కేసులు పెడతారంటూ ఎవరిని బెదిరిస్తారు. భయపడేదని, కేసులు పెట్టుకోండని అన్నారు.

మీ బెదిరింపులకు భయపడేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.

అందరిని ముంచిన ప్రభుత్వం మీదని, తప్పు చేసిన పంతం నానిజీ ప్రాయశ్చిత్తం దీక్ష చేపడితే సరిపోయిందా.. అని ప్రశ్నించారు.

మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులను సంఘవిద్రోహ శక్తులు అన్నారు, ఇప్పుడు ఏమైందని అన్నారు.

వైసిపి అదికారంలోకి వస్తే తప్పు చేసిన పోలీసులను వదలమని అన్నారు.

విడుదల రజినీ పై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్ లకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు నమోదు చేశారా…. అని ప్రశ్నించారు.

పవన్ నీవు గతంలో చెప్పు చూపించావు సుమొటోగా కేసు పెట్టారా… అని గుర్తు చేశారు.

తప్పుచేసిన వారిని సప్తసముద్రలు దాటినా వదలము అని అన్నారు.

ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేశారని, డిజీపీ మెమో ఇచ్చారు, వైసీపీ లో కీలక అధికారులకు అని అన్నారు.

మీరు ఏమి చేసారో, ఏమి చెబుతున్నారో ఆలోచించండని అన్నారు.

సూపర్ సిక్స్, పోలవరం గాలికి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం సరికాదని అన్నారు.