భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..లక్కవరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
అంబేద్కర్ కోనసీమ జిల్లా | మలికిపురం
మలికిపురం మండలం లక్కవరం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
స్థానికుల వివరాల ప్రకారం.. భీమవరం నుంచి లక్కవరంలోని ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను స్థానికులు, పోలీసులు సహాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
మృతులు, క్షతగాత్రులు లక్కవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల వివరాలు, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
