..భారత్ న్యూస్ అమరావతి..శ్రీకాకుళం జిల్లా :
పలాసలో ఎయిర్ పోర్ట్… రయ్ .. రయ్.
పలాస నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్ పోర్టునిర్మాణానికి ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన చేసిన విషయం తెలిసిందే.
వజ్రపు కొత్తూరు, మందస మండలాల పరిధిలో సుమారు 1383 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు.
స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం గురువారం ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఏర్పోర్ట్ అథారిటీ అధికారులు పరిశీలించారని పలాస ఆర్డిఓ జి వెంకటేశ్వరరావు మీడియాతో తెలిపారు.
