రానున్న 5 రోజులు మేఘావృతమైన వాతావరణం మరియు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు: #APSDMA ఎండీ ప్రఖర్ జైన్

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..రానున్న 5 రోజులు మేఘావృతమైన వాతావరణం మరియు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు: #APSDMA ఎండీ ప్రఖర్ జైన్

కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ఆదివారం (19-07-2026) వాతావరణం:

పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

తేలికపాటి వర్షాలు: మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల పడే అవకాశం ఉంది.

జాగ్రత్తలు – సూచనలు: ఉరుములు, ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగుల వద్ద నిలబడకూడదు.

సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున చిన్న బోట్లు ఉపయోగించే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి.