భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..తెలంగాణలో క్యూఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులు

Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలంగాణ :
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులను డెబిట్ కార్డు సైజులో క్యూఆర్ కోడ్‌తో సిద్ధం చేసి పంపిణీ చేయనుంది.
ఇప్పటికే ఈ కార్డులు పలు జిల్లాలకు చేరాయి. కార్డుపై యజమాని ఫొటో, పేరు, అడ్రస్, సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫొటోలను ముద్రించారు.
క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే లబ్ధిదారులు, తీసుకున్న రేషన్ వివరాలు తెలుస్తాయి.

త్వరలో సీఎం కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. కాగా రాష్ట్రంలో 1.05 కోట్ల రేషన్ కార్డులున్నాయి.
