అవనిగడ్డలో ఘనంగా కనపర్తి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..అవనిగడ్డలో ఘనంగా కనపర్తి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు

అవనిగడ్డ: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు ఆదివారం అవనిగడ్డలో అత్యంత వైభవంగా జరిగాయి.స్థానిక అవనిగడ్డ వంతెన సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనతో కేక్ కట్ చేయించి, ఘనంగా పూలదండలు వేసి శాలువాలతో సత్కరించారు. కనపర్తి శ్రీనివాసరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.