ఏలూరు జిల్లా ముదినేపల్లి ::: భారత్ డిజిటల్ వరల్డ్ వెబ్ న్యూస్ ప్రతినిధి:::::: భారత్ డిజిటల్ వరల్డ్ వెబ్ న్యూస్ కథనంతో కదిలిన గాంధేయవాదులు ముదినేపల్లి మండల రిపోర్టర్ కథనాలతో కదిలిన గాంధీయవాదులు” కైకలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రోత్సాహంతో హర్షం వ్యక్తపరిచిన ముదినేపల్లి మండల ఆర్యవైశ్య సంఘ నాయకులు “ముదినేపల్లి నడిబొడ్డు లో గాంధీ విగ్రహం ప్రతిష్టించడానికి అనుమతిని స్థలాన్ని కేటాయించాలని అర్జీని సమర్పించిన గాంధీయవాదులు”” వికసిస్తున్న గాంధీయవాదుల ఆనందం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ముదినేపల్లి మండల తహసిల్దార్ లతీఫ్ పాషాకు గాంధీ విగ్రహం ఏర్పాటు చేయటానికి నేషనల్ హైవే రహదారి వెంబడి స్థలం కేటాయించాలని వినతి పత్రం ద్వారా అర్జీని సమర్పించారు. మండల పరిషత్ అధికారి ఎంపీడీవో రామకృష్ణకి కూడా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయించుకోవడానికి స్థలాన్ని పంచాయతీ పరిధిలో నేషనల్ హైవే రహదారి వెంబడి కేటాయించాలని వినతి పత్రాన్ని ఇచ్చారు ఎమ్మార్వో లతీఫ్ భాషకు, ఎంపీడీవో రామకృష్ణకు గతంలో గాంధీ మండపం ఉన్న స్థలాన్ని పరిశీలించాలని, సదరు స్థలం అక్రమ ఆక్రమణకు గురి అయిన ఎడల, ఆక్రమణదారులను తొలగించి, ఖాళీ చేయించి గాంధీజీ మండప నిర్మాణ స్థలంగా మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు గ్రామం సచివాలయ కార్యాలయంలోని రికార్థులలో తీర్మానం చేసి, గాంధీ మండప స్థలంగా నమోదు చేయించాలని కోరారు సానుకూలంగా స్పందించిన ఎమ్మార్వో లతీఫ్ పాషా, ఎం.పీ.డీ.వో. రామకృష్ణ త్వరితగతిన తగు చర్యలు తీసుకుంటామని ముదినేపల్లి మండల ఆర్యవైశ్య సంఘ నాయకులకు తెలియజేశారు.

