పసుమర్రులో పేకాట స్థావరంపై రూరల్ పోలీసుల దాడి.. 10 మంది పట్టివేత

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..పసుమర్రులో పేకాట స్థావరంపై రూరల్ పోలీసుల దాడి.. 10 మంది పట్టివేత

చిలకలూరిపేట:మండలంలోని పసుమర్రు గ్రామ పరిధిలోని పొలాల్లో పేకాట (కోతముక్క ఆట) నిర్వహిస్తున్న వారిపై చిలకలూరిపేట రూరల్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు.రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.19,300 నగదు, 10 సెల్‌ఫోన్లు, 4 మోటార్‌సైకిళ్లు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తూ, చిలకలూరిపేట మండల పరిధిలో కోడిపందాలు, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్య కలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.