భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.బ్రేకింగ్ న్యూస్ ..కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గ లోని కంకిపాడు పరిధిలో…
గంజాయి ముఠా సభ్యుడి అరెస్ట్ – పోలీసులపై దాడి ఆత్మరక్షణలో కాల్పులు జరిపినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడి

కంకిపాడు మండలం కోమటిగుంట లాకులు వద్ద గంజాయి సభ్యుడిపై పోలీసులు జరిపిన కాల్పులు కలకలం రేపడంతో పెనమలూరు పోలీస్ స్టేషన్లో కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు జరిగిన సంఘటనపై విలేకరులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ

ఆగస్టు 31వ తేదీ సాయంత్రం సుమారు 6:00 గంటలకు రాజమండ్రిలో ఏఆర్ పీసీ 2978 వెంకటేశ్వర్లు, ఎన్. లోవరాజు అనే కానిస్టేబుళ్లు అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేస్తుండగా నిందితులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏఆర్ పీసీ వెంకటేశ్వర్లు కిడ్నీ, అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిని ప్రస్తుతం ఆసుపత్రిలో క్రిటికల్ కండిషన్‌లో ఉన్నారు.

రాజమండ్రి పోలీసుల సమాచారంతో గన్నవరం, కంకిపాడు సబ్-డివిజన్లలో ముమ్మర తనిఖీలు చేపట్టగా, అర్ధరాత్రి సుమారు 12:00 గంటల సమయంలో కోమటి గుంట లాకులు సమీపంలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం సమీపంలో వైట్ కేటీఎం (KTM) బైక్‌పై వస్తున్న నిందితుడిని పోలీసులు అడ్డుకున్నారు.

నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో పీసీ 982 దేవశెట్టి శ్రీనుపై కత్తితో దాడి చేయడంతో పాటు పోలీస్ జీపుపై రాళ్లు విసిరి విధ్వంసానికి యత్నించాడు.

హెచ్చరికగా గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరిపినప్పటికీ లొంగిపోకపోవడంతో, కంకిపాడు మరియు గన్నవరం సీఐలు ఆత్మరక్షణార్థం నిందితుడి మోకాలి కింద భాగంలో కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.

అవినాష్ (సుమారు 22 సంవత్సరాలు), పెనమలూరు నివాసి.

ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని అక్రమంగా తరలించి విక్రయించడం. టెస్ట్ కిట్ ద్వారా నిందితుడు గంజాయి తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.

నిందితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యం అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.

పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

యువత పెడదోవ పట్టి గంజాయి రవాణా, వినియోగం వంటి చట్టవిరుద్ధ పనుల్లో పాల్గొనవద్దని; ఉపాధి అవసరమైతే సాయం అందిస్తామని, నేరాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

తల్లిదండ్రులు తమ పిల్లల నడవడిక, తిరుగుడుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచాలని విజ్ఞప్తి చేశారు.