భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..పెద్దపులి దాడిలో ఎద్దు మృతి….

ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన మర్సకోల తెలంగరావుకు చెందిన ఎద్దు పెద్దపులి దాడిలో మృతి చెందింది.

మేత కోసం రావణ్‌పల్లి అటవీ ప్రాంతానికి వెళ్లిన ఎద్దుపై పెద్దపులి దాడి చేసినట్లు అటవీ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.

ఎద్దు మృతికి సంబంధించిన నష్టపరిహారం అందించేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. సిర్పూర్ రేంజ్‌లో పెద్దపులుల సంచారం కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ సూచించారు.

అటవీశాఖ అనుమతి లేకుండా ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు….