భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు.

హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని శాసనసభ భవనంలోని అసెంబ్లీ హాల్‌లో సమావేశం జరగనుంది.

స్పీకర్ ఆదేశాల మేరకు సభ్యులకు అధికారిక సమాచారం అందజేశారు. సభ్యులందరూ సమావేశానికి హాజరు కావాలని శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి కోరారు.