భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..మూఢనమ్మకంతో తల్లిని బావిలో తోసి చంపిన కొడుకులు

T.G : కరీంనగర్ జిల్లాలో సైదాపూర్ మండలంలోని ఎలబోతారం గ్రామంలో మూఢనమ్మకాలతో వృద్ధురాలిని బావిలో తోసి చంపిన కేసును పోలీసులు చేధించారు. ఏప్రిల్ 6న వృద్ధురాలు నూనె వెంకటమ్మ (80) వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో ఆమె కొడుకులు నూనె సమ్మయ్య, నూనె శ్రీనివాస్‌ ఆమెను బావిలో పడవేసినట్లు తేలింది. ఎవరి ఇంట్లో చనిపోతే వారు ఇల్లు వదిలేయాల్సి వస్తుందనే భయంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ వివరాలను సోమవారం హుజురాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు.