భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.ఢిల్లీలో విజృంభిస్తున్న స్వెన్ ఫ్లూ

ఢిల్లీలో విజృంభిస్తున్న స్వెన్ ఫ్లూ
ఢిల్లీలో స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 1,777కి పైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో, ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

అనవసరంగా కళ్లు, ముక్కు, నోటిని తాకవద్దని, తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.