భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
ఆంధ్రప్రదేశ్ : తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
మామండూరు స్టేషన్ సమీపంలో S1 కోచ్ వద్ద రైలు బ్రేక్ షూ నుంచి మంటలు చెలరేగి పొగలు రావడాన్ని ప్రయాణికులు గుర్తించి వెంటనే రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు.

దీంతో సిబ్బంది సకాలంలో రైలును నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. అనంతరం అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు..
