భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఈ నెల 16 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ: మంత్రి సీతక్క….
తెలంగాణ : ఈ నెల 16న ములుగు జిల్లాలోని మేడారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి చేయూత పింఛన్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
గురువారం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా సహచర మంత్రులతో కలిసి సీఎం మేడారం చేరుకుంటారని తెలిపారు. రూ.16వేల కోట్లతో చేపట్టిన హ్యామ్ రోడ్ల పైలాన్‌ను, నూతన కలెక్టరేట్‌ను సీఎం ఆవిష్కరిస్తారని వెల్లడించారు.

కొత్త పెన్షన్లలో ప్రధానంగా వితంతు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది…
