భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె

తొలి దశలో పలు సర్వీసుల నిలిపివేత

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఉపకార వేతనం పెంపు డిమాండ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల సంఘం ఈ నెల 11వ తేదీ నుంచి తొలి దశ సమ్మె ప్రారంభించాలని నిర్ణయించింది.

అధికారులతో జరిగిన చర్చల సందర్భంగా ఉపకార వేతనం పెంపుపై ఎలాంటి లిఖితపూర్వక హామీ అందలేదని ఆ సంఘం నేతలు సోమవారం రాత్రి గుంటూరులో ప్రకటించారు.

అందువలన తొలి దశ సమ్మెను మంగళవారం నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఏపీ జూడాల సంఘం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇందులో భాగంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అత్యవసరం కాని వైద్యసేవలన్నింటినీ నిలిపేస్తారని వెల్లడించింది.