ఫ్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం..…భారత్ న్యూస్ హైదరాబాద్….
600 మంది నుండి సుమారు 150 కోట్లు వసూలు..
బషీర్ బగ్ సీసీఎస్ ముందు ఆర్జే వెంచర్స్ బాధితుల ఆందోళన..
నారాయణ్ ఖేడ్ , ఘట్కేసర్ , పఠాన్ చెర్వు కర్తనుర్ ప్రాంతాలలో అపార్ట్మెంట్ , ఫార్మ్ ల్యాండ్ పేరిట ఆర్జే వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేశారు ..

2020 లో తాము నమ్మి ఒక్కొక్కరం 20 లక్షల నుండి 50 లక్షల వరకు కట్టాము..

నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు..

వెంచర్ ఎండి భాస్కర్ గుప్త , డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి సుమారు 600 మంది సుమారు 150 కోట్లు కట్టాము..

తాము ఎన్నిసార్లు అడిగిన నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు..

గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చారు… కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయి..

సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాము… వెంచర్ కార్యాలయం సైబరాబాద్ పరిధిలో ఉందని తెలిపారు… అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేస్తాము..

ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాము…