.భారత్ న్యూస్ హైదరాబాద్….లివర్ దానం చేసి భర్తను బతికించుకుంది

పెళ్లి జరిగేటపుడు ఒకరికొకరు తోడుండాలని వధూవరులతో వాగ్దానం చేపిస్తారు. ఖమ్మంకు చెందిన ఓ జంట దానిని నిజం చేసింది. పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా కాలేయం మార్చాల్సిందేనని వైద్యులు చెప్పారు. కానీ, ఎంత వెతికినా డోనర్ దొరక్కపోవడంతో అతని భార్య లావణ్య ముందుకొచ్చింది. ఆమె నుంచి 65 శాతం లివర్ తీసి సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారు.