నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి….పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పూర్ణిమ దేవి

పాకాల ( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పి.పూర్ణిమ దేవి నేషనల్ లోక్ అదాలత్ గురించి అధికారులతో సమావేశం బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పూర్ణిమ దేవి మాట్లాడుతూ నేషనల్ లోక్ అదాలత్ డిసెంబర్ 14వ తేదీన జరుగుతుంది.లోక్‌ అదాలత్‌లో వీలైనంత వరకు రాజీ చేయదగ్గ కేసులను పరిష్కరించాలని సూచించారు.ప్రత్యేకించి క్రిమినల్‌ కేసులు,సివిల్‌ కేసులు,ప్రీలిటిగేషన్‌ కేసులు,కుటుంబ తగాదాలు,10లీటర్లలోపు నాటుసారా కేసులు తదితర కేసులను ఇరుపక్షాల రాజీపూర్వక అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని అన్నారు.కావున కక్షి దారులు పెండింగ్ లో ఉన్న కేసులు వంటివి రాజీమార్గంలో వచ్చి చేసుకోగలరని పేర్కొన్నారు.ఈ సమావేశంలో పాకాల సి.ఐ మద్దయ్యాచారి,కల్లూరు సి.ఐ సూర్యనారాయణ,ఎస్.ఐ వెంకటేశ్వర్లు,చంద్రగిరి,పులిచర్ల ఎక్సైజ్ సి.ఐలు,ఎస్.ఐ లు పాల్గొన్నారు.