భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…Vimal Elaichi ప్రకటనపై బాలీవుడ్ నటులకు షోకాజ్ నోటీసులు
మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఆగస్టు 11, 2026న అజయ్ దేవగణ్, షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. VIMAL Elaichi ప్రకటనలు, ప్రచారంలో పాల్గొనడంపై వివరణ కోరింది.
Food Safety and Standards Act, 2006లోని సెక్షన్ 24 ప్రకారం ఆహార ప్రకటనల్లో తప్పుదారి పట్టించే ప్రచారాన్ని నిషేధించిన విషయాన్ని నోటీసులో ప్రస్తావించింది. VIMAL బ్రాండ్ పాన్ మసాలాతో ప్రధానంగా అనుసంధానమై ఉందని FDA పేర్కొంది.

నోటీసు అందిన తేదీ నుంచి 15 రోజుల్లో లిఖితపూర్వక వివరణ, సంబంధిత ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. వివరణ అందకపోయినా లేదా సంతృప్తికరంగా లేకపోయినా చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని FDA స్పష్టం చేసింది.
