..భారత్ న్యూస్ అమరావతి..తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు స్వర్ణం
ప్రపంచ ఇండోర్ ఆర్చరీ సిరీస్ టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణంతో మెరిసింది.
ఆదివారం కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఈ విజయవాడ ఆర్చర్ 147-145 తేడాతో మరీటా (బెల్జియం)ను ఓడించింది. అంతకుముందు సెమీస్‌లో ఆమె షూటాఫ్‌లో ఎలీసా (ఇటలీ)పై గెలిచింది.
