భారత్ న్యూస్ విజయవాడ…మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని 48 గంటల్లో పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కి పంపించిన ఘనత మాది. ముచ్చుమర్రి ఘటనలో బాధితురాలిని గుర్తించడానికి సమయం పట్టింది. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారు.
దిశ చట్టం గురించి గొప్పగా చెప్తున్నారు..అసలు దిశ చట్టం ఉందా? దిశ యాప్, చట్టం పని చేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి.. లేని దిశ చట్టం ప్రకారం కేసులు పెట్టారు. గంజాయిపై గత ఐదేళ్లలో ఒక్క సమీక్ష అయినా చేశారా? మా ప్రభుత్వమే మహిళల భద్రతకు పెద్దపీట వేసింది._ హోంమంత్రి వంగలపూడి అనిత…
