..భారత్ న్యూస్ హైదరాబాద్..Bulldozer Justice: నిందితుల ఇళ్లను కూల్చడం హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్ జస్టిస్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
బుల్డోజర్ జస్టిస్‌పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.. నిందితుల ఇళ్లను కూల్చడం చట్ట విరుద్ధమని.. ఇళ్లను కూల్చడం అంటే నివసించే హక్కును కాలరాయడమే అంటూ సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. పలు కేసుల్లో ఉన్న నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం తగదని.. నిష్పాక్షిక విచారణ పూర్తికాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమంటూ పేర్కొంది..దోషిగా నిర్థారించినా చట్ట ప్రకారమే శిక్ష ఉంటుందని స్పష్టంచేసింది. న్యాయవ్యవస్థ స్థానాన్ని పాలనావ్యవస్థ భర్తీ చేయలేదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.. అధికారులే కోర్టుల పాత్ర పోషించడం సరికాదని చెప్పింది.. కార్యనిర్వాహక అధికారి ఒక వ్యక్తిని దోషిగా నిర్థారించలేరని, అందుకు కోర్టుకు ఉన్నాయని సర్వోన్నత ధర్మాసనం గుర్తు చేసింది..
ఈ బుల్డోజర్ జస్టిస్ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. చట్టాన్ని, నిబంధనలను అతిక్రమించి నిందితుడు లేదా దోషి ఇంటిని కూల్చేస్తే కనుక.. ఆ కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాల్సిందేనని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఇకపై కుదరవని తేల్చి చెప్పింది.. మతానికి, కూల్చివేతలకు కూడా లింక్ పెట్టొద్దని కూడా ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఆదేశం ఏ ఒక్క రాష్ట్రానికో కాదని.. యావత్ దేశానికో సంబంధించినదని సుప్రీంకోర్టు పేర్కొంది.. కేవలం క్రిమినల్ కేసులో నిందితుడు లేదా నిందితుడు అనే కారణంతో ఎవరైనా ఇంటిని కూల్చివేయలేమని కోర్టు పేర్కొంది. అటువంటి పరిస్థితిలో అధికారులు చట్టాన్ని విస్మరించరాదని.. బుల్డోజర్ చర్య అంటే ప్రాథమిక హక్కులను కాలరాయడమేనంటూ పేర్కొంది.
