భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..మీ సేవ యాప్‌లో ఆర్టీసీ టికెట్లు!

T.G : త్వరలోనే ఆర్టీసీ టికెట్లను ‘మీ సేవ’ యాప్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.

ప్రజా రవాణా సేవలు అయిన ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్..

ఇక నుంచి అన్ని ఒకే యాప్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీని ద్వారా ప్రయాణికుడు ఒకేచోట నుంచి ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్‌లో తన గమ్యస్థానానికి ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు.

ఛార్జీలను కూడా ఆన్ లైన్‌లో చెల్లించవచ్చు.