భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..భిక్షగాడి ఆదాయం…
హరిద్వార్లో భిక్షాటన.. 8 గంటల్లోనే రూ.4,000!
యూట్యూబర్ పురుషోత్తం హరిద్వార్లో చేసిన పని ఆన్లైన్లో చర్చకు దారి తీసింది. తన ఫ్రెండ్ సచిన్ ను బిచ్చగాడిగా మార్చి మెడలో QR స్కానర్ వేసి భక్తుల వద్ద భిక్షాటన చేయించాడు.
కొందరు అతడిని పట్టించుకోకపోగా మరికొందరు డబ్బులు ఇచ్చారు. ఇలా 8 గంటల్లోనే రూ.4వేలు రాగా నెలకు ₹1.2L సంపాదించవచ్చని వీడియోలో చెప్పారు.
అయితే భిక్షాటనను ఆదాయమార్గంగా చూడొద్దని, నిజాయతీగా పనిచేసి సంపాదించాలని ఫాలోవర్లకు సూచించారు…
