భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…క్రీడలతో విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం : విక్కుర్తి

అవనిగడ్డ: అవనిగడ్డ సబ్‌జోన్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 29న స్పోర్ట్స్ డే సందర్భంగా అవనిగడ్డ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న క్రీడా పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు హాజరై కబ్బడి పోటీలను ప్రారంభించి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివిసీమ ఉపాధ్యాయుల కర్మాగారంగా అవనిగడ్డ పేరుగాంచిందని అన్నారు. గత 26 సంవత్సరాలుగా రాష్ట్రంలో మరెక్కడా జరగని విధంగా అవనిగడ్డలో స్పోర్ట్స్ డే వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇంతకాలంగా క్రీడలను ప్రోత్సహిస్తూ విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.విద్యార్థి దశలో చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడా పోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని విజయానికి కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.క్రీడలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను, సమష్టి భావనను పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడతాయని తెలిపారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, ఉపాధ్యాయులు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా వివిధ క్రీడా పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.