భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.క్రీడలతో మానసిక ఉల్లాసం
జాతీయ క్రీడా దినోత్సవ ర్యాలీలో విక్కుర్తి
అవనిగడ్డ: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అవనిగడ్డ సబ్‌జోన్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శనివారం భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. క్రీడా జ్యోతిని చేతబట్టి విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టినరోజును పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ప్రతిరోజూ క్రీడలు ఆడటం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.గత రెండు రోజులుగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు విక్కుర్తి శ్రీనివాసరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులను ఈ సందర్భంగా విక్కుర్తి అభినందించారు.
