భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…సత్తా చాటిన మహిళా రెజ్లర్లు.. మాన్సికి రజతం….
అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత మహిళా రెజ్లర్లు మూడు పతకాలతో మెరిశారు. 68 కిలోల విభాగం ఫైనల్లో చైనాకు చెందిన చెంగ్లింగ్ సాంగ్ చేతిలో ఓడిన మాన్సి లాథర్ రజతంతో సరిపెట్టుకుంది.
ఇక కాంస్య పతక పోరులో తన్వి మగ్దుమ్ (57 కేజీలు), కోమల్ (59 కేజీలు) ప్రత్యర్థులపై ఘనవిజయ సాధించి పతకాలను కైవసం చేసుకున్నారు….
