భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ..1984లో పరారీ.. 42ఏళ్ల తర్వాత దొరికాడు!
ఢిల్లీలో 1984లో జరిగిన హత్య కేసులో నిందితుడిని 42ఏళ్ల తర్వాత పోలీసులు పట్టుకున్నారు.
అప్పట్లో ఈ కేసులోని మరో నిందితుడు దొరికినా నాథులాల్ తప్పించుకున్నాడు.
దీనిపై ఇటీవల ఢిల్లీ పోలీసులు పాత ఫైల్స్ తవ్వి దర్యాప్తు చేయగా హర్దోయ్ (UP)లో ఉన్నట్లు తెలిసి AUG 18న అరెస్ట్ చేశారు.
ఆచూకీ బయటపడొద్దని నాథులాల్ కూరగాయ మార్కెట్లలో చిన్నచిన్న పనులు చేస్తూ బతికాడని, పెళ్లి కూడా చేసుకోలేదని పోలీసులు తెలిపారు.
