భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ,హర్యానాలో 5 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన ….

హర్యానాలోని పల్వాల్‌లో 5 కిలోమీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఇంత పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించడం ద్వారా వరల్డ్ రికార్డు నమోదైనట్లు నిర్వాహకులు ప్రకటించారు. దేశభక్తిని చాటుతూ నిర్వహించిన ఈ భారీ కార్యక్రమం పల్వాల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది….