భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్.ఎస్‌బీఐ శాలరీ ఖాతాదారులకు షాక్.. ఏటీఎం ఛార్జీల మార్పు!..

SBI తన శాలరీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ అందించింది. అక్టోబర్ 1 నుంచి, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో చేసే ఉచిత లావాదేవీల పరిమితి నెలకు 10 నుంచి 5కు తగ్గించారు.

ఈ 5 ఉచిత లావాదేవీలు దాటితే, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.23 + GST, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.11 + GST చొప్పున ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే, ఈ నిబంధనలు కేవలం శాలరీ ఖాతాదారులకు, ఇతర బ్యాంకుల ఏటీఎంలు వాడినప్పుడు మాత్రమే వర్తిస్తాయి. సొంత ఎస్‌బీఐ ఏటీఎంల వాడకంలో ఎలాంటి మార్పు లేదు…..