భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ATM విత్ డ్రాయల్ రూల్స్ మార్చిన SBI
శాలరీ అకౌంట్ హోల్డర్ల నెలవారీ ATM విత్ డ్రాయల్ రూల్స్ లో SBI మార్పులు చేసింది. ఇతర బ్యాంకుల ATMలలో జరిపే ఉచిత లావాదేవీల సంఖ్యను సగానికి కుదించింది. గతంలో నెలకు 10 ఫ్రీ ట్రాన్సాక్షన్లకు అనుమతి ఉండగా, ఇప్పుడు 5కు తగ్గించింది. లిమిట్ దాటిన తర్వాత ప్రతి లావాదేవీపై రూ.23(+GST) ఛార్జీ విధించనుంది. నాన్-క్యాష్ ట్రాన్సాక్షన్స్‌పై ₹11(+GST) విధించనుంది. అక్టోబర్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.
