భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..కొత్తగా జపం మొదలు పెట్టాలి అనుకునే వారి కోసం, అన్ని వరుసగా ఇక్కడ ఇచ్చినవి ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయాలి:
1.: గణపతి మూల మంత్ర జపం:
“ఓం గం గణపతయే నమః”
ఈ మంత్రం లక్ష జపం చేయాలి..
ఇది గణపతి మూల మంత్రం స్వామి ని యధా శక్తి పూజించి గణపతిని గురువుగాభావించి జపం మొదలు పెట్టాలి.
:శ్రీ మాత్రే నమః:
2.:దత్తాత్రేయ మూల మంత్రం:-:
అస్యశ్రీ దత్తాత్రేయాష్టాక్షరీ మహామంత్రస్య శబరరూపీ శంకర ఋషి: , గాయత్రీ చంద: , శ్రీ దత్తాత్రేయో దేవతా , ద్రాo బీజం, నమః శక్తి:, దత్తాత్రేయాయేతి కీలకం, జపే వినియోగ:
:మంత్రం:
::ఓం ద్రాo దత్తాత్రేయాయ నమః
పూజ సమయంలో ఇలా మంత్రం యొక్క ఋషి , న్యాసం చదివి మొదలు పెట్టాలి, ఈ మంత్రం లక్ష జపం చేయాలి..
3.::దక్షణామూర్తి మూల మంత్రం:
1.ఓం నమోభగవతే దక్షణామూర్తయే మహ్యం మేధాo ప్రజ్ఞాo ప్రయచ్ఛ ప్రయచ్ఛ స్వాహా
ఈ మంత్రాన్ని లక్ష జపించండి.
4.::భైరవ మంత్రం:
“ఓం హ్రీం హ్రీం సకలహ్రీం పంచవక్త్ర భైరవాయ నమః”
::ఈ మంత్రం పది వేల జపం చేయాలి
- ::మణిద్వీప వర్ణన: (108 సార్లు పూర్తి చేయాలి)
మహా శక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రం రూపిణి మన మనస్సుల లో కొలువై ఉంది || 1 ||
సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు || 2 ||
