భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..తిరుపతి :ఆగస్టు 19
తిరుమల శ్రీవారి దర్శనానికి మార్చి నెల నుంచి ఇప్పటి వరకు భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు.. ముఖ్యంగా వీకెండ్ వస్తే చాలు కొండకు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలలో శుక్రవారం నుంచి సోమవారం వరకు రద్దీ కనిపిస్తోంది. ఐదారు నెలలుగా రోజువారీ 60వేల నుంచి లక్ష వరకు భక్తులు స్వామివారి ని దర్శనం చేసుకుంటున్నారు. తిరుమలలో రద్దీ పెరగడంతో శ్రీవారి హుండీకి కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది.
చాలాకాలం తర్వాత శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. సాధారణంగా బ్రహ్మో త్సవాలు, వైకుంఠ ద్వార దర్శనా సమ యంలోనే ఇంత భారీగా ఆదాయం వస్తుంది. ఈసారి మాత్రం సాధారణ రోజులోనే భారీగా ఆదాయం రావడం విశేషం. మంగళ వారం తిరుమల శ్రీవారిని 80,905 మంది భక్తులు దర్శించుకున్నారు..
33,539 మంది భక్తులు నిన్న స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి హుండీకి రూ.6.12 కోట్లు ఆదాయం వచ్చింది. మంగళ వారం రోజు 4.16 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించ గా.. అన్నప్రసాదాల ను 2.88 లక్షలమంది స్వీకరించారు. తిరు మలలో 3546మంది భక్తులు వైద్య చికిత్స పొందారు. తిరుమ లలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత వెళ్లే సర్వ దర్శనం భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుం దంటున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోం ది. సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 నుంచి 7 గంటల సమయం పడుతోంది.
